జయలలిత సర్కారుతో ప్యూజో సిట్రాన్ అధికారుల భేటీ!

గతంలో తమిళనాడులో ప్లాంటు ఏర్పాటు చేయాలని కంపెనీ భావించినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కరుణానిధి ప్రభుత్వంతో తమ రాయబారాన్ని కంపెనీ విరమించుకుంది. ప్రస్తుతం తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో, ప్యూజో చర్చలకు సిద్ధమైంది. తమిళనాడు ఇప్పటికే ఆటోమొబైల్ హబ్‌గా ఎదుగుతుండటం, అన్ని రకాల రవాణా సదుపాయాలను కలిగి ఉండటంతో ప్యూజో వీలైనంత వరకూ ఆ రాష్ట్రంలోనే ప్లాంటును ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇది ప్యూజో కంపెనీకు జయలలిత ప్రభుత్వం ప్రకటించే రాయితీలపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వంతో ప్యూజో ఉన్నతాధికారుల భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది.


Click it and Unblock the Notifications








