మొన్న జయ, నిన్న మోడి: ప్యూజో అధికారుల రాయబారాలు

ఇక్కడ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్యూజో కంపెనీకు స్థలంపై భారీ రాయితీలను అందించడానికి సిద్ధంగా ఉంటే, తమిళనాడు ఇప్పటికే ఆటోమొబైల్ హబ్‌గా ఎదుగుతూ విదేశీ లగ్జరీ కార్ల కంపెనీలను ఆకర్షిస్తోంది. మరోవైపు గుజరాత్ సర్కారు అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు ఆటోమొబైల్ తయారీదారులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రాన్ని ఎన్నుకుంటే తమకు లబ్ధిదాయకంగా ఉంటుందనే అంశంపై కంపెనీ తీవ్రంగా కసరత్తులు చేస్తోంది.
గడచిన దశాబ్ధం క్రితం మన దేశం వదలి వెళ్లిన ప్యూజో తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు ఈ ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం గజరాత్‌లో టాటా నానో ప్లాంటు నెలకొల్పిన సనంద్‌లో భూములను కంపెనీ పరిశీలించింది. చూస్తుంటే.. ఆటోమొబైల్ కంపెనీలన్నీ టాటా మోటార్స్‌ను ఆదర్శంగా తీసుకొని గుజరాత్‌కు క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది. గుజారత్‌లో ఇప్పటికే, టాటా మోటార్స్, జనరల్ మోటార్స్ కంపెనీలు ప్లాంట్లను కలిగి ఉండిగా.. మారుతు సుజుకి, ఫోర్డ్, హీరో హోండా కంపెనీలు కూడా ఈ రాష్ట్రంపైనే దృష్టి సారిస్తున్నాయి.
ఏదేమైనప్పటికీ.. మౌలిక సదుపాయాలు, రవాణా, విదేశీ ఎగుమతులకు తమిళనాడు రాష్ట్రం అన్ని విధాల అనుకూలంగా ఉండటంతో ప్యూజో వీలైనంత వరకూ ఈ రాష్ట్రాన్ని ఎంచుకనే అవకాశాలు ఉన్నాయి. అయితే, తాజాగా గుజరాత్ సర్కారు కంపెనీ అధికారులు భేటీ కావడాన్ని బట్టి చూస్తే, మోడి సర్కారు ఇచ్చే రాయితీలను కంపెనీ తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ సందేహాలకు తెరపడాలంటే, ప్లాంటు ఏర్పాటుపై కంపెనీ ఖచ్ఛితమైన నిర్ణయాన్ని ప్రకటించే వరకూ వేచి చూడాల్సిందే మరి.


Click it and Unblock the Notifications








