చౌక కార్ల తయారీ పర్యావరణానికి నష్టం కలిగిస్తుంది: పుస్తకం

శిలాజ ఇంధనాలు, రోడ్లు, మౌలికవసుతులకు పెరుగుతున్న డిమాండు కారణంగా రానున్న రోజుల్లో పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆ పుస్తకం పేర్కొంది. యునైటెడ్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చేసిన పరిశోధన ఆధారంగా "రూపా అండ్ కో" ఓ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకంలో పరిశోధకులు పర్యావరణం గురించి మరియు మానవాళికి చెట్లు అందిస్తున్న విలువైన సేవల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. మదన్ మోహన్ పంత్ రాసిన "ట్రీస్ ఇంక్రిడబుల్: లైఫ్ సస్టైనింగ్ లైవ్స్" అనే పుస్తకంలో ఈ విషయాలను పేర్కొన్నారు.
సజీవంగా ఉన్న ఓ చెట్టు ఏటా మానవాళికి, పర్యావరణానికి అవసరమైన రూ. 40,000కు పైగా విలువైన ప్రాణాధార సేవలను అందిస్తుందని ఆ పుస్తకంలో తెలిపారు. 50 ఏళ్లకు పైగా జీవితకాలం కలిగిన చెట్టు సగటున 1,62,000 డాలర్ల (సుమారు రూ. 72,41,392) విలువై సేవలను మనకు అందిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. కాబట్టి.. ఆటోమొబైల్ కంపెనీలు ఇలాంటి చౌక కార్లను తయారు చేసేటప్పుడు పర్యావరణ పరిరక్షణ గురించి కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మీరు కూడా చౌక కార్లను కొనేటప్పుడు మరొక్కసారి మన పర్యావరణం గురించి ఆలోచించండి ప్లీజ్..!


Click it and Unblock the Notifications








