'నానో' కోసం కదిలొచ్చిన రతన్ టాటా!

Ratan Tata to hand over Nano keys to customers
రతన్‌ టాటా కలల ప్రాజెక్టు 'నానో' కారు. తొలుత రూ.లక్ష కారుగా విడుదల చేసి దేశంలో సంచలనం సృష్టించారు. ఇప్పుడీ కారును సామాన్యుడి చెంతకు తీసుకెళ్లి విక్రయాలను విజయవంతం చేయడానికి పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా సరికొత్త ఒరవడి ఎంచుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ నానోలు విక్రయించిన చిన్న చిన్న నగరాలకు సైతం ఆయన వెళ్లి అక్కడ డీలర్లను, కొన్న వినియోగదారులను ఉత్సాహపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ద్వితీయశ్రేణి నగరాల్లో అక్కడ సామాన్యులను పలకరించి నానోకు విశేష ప్రచారం కల్పిస్తున్నారు.

ఇందులోభాగంగానే శనివారం ఆయన విజయవాడలోని టాటా డీలర్‌ జాస్పర్‌ ఇండస్ట్రీస్‌కు వచ్చారు. జాస్పర్‌ కేవలం 14 రోజుల్లో 234 నానో కార్లు విక్రయించింది. ఈ సందర్భంగా నానో కొన్న వినియోగదారులకు స్వయంగా తాళాలు అందివ్వడానికి రతన్‌ టాటా విజయవాడ నగరానికి వచ్చారు. మొట్టమొదటిసారి ఇక్కడికొచ్చిన ఆయనకు జాస్పర్‌ ఇండస్ట్రీస్‌ అధినేత బాడిగ రామకృష్ణ, ఆయన కుమారుడు సుమంత్‌లు ఘనస్వాగతం పలికారు. రతన్‌ దాదాపు మూడు గంటల పాటు విజయవాడలోనే గడిపారు.

ఈ సందర్భంగా నానో కొన్న 234 మంది వినియోగదారులను ఒక్కొక్కరిగా వేదికపైకి పిలిచి టాటా స్వయంగా కారు తాళాలు వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ కారును సామాన్యుల కోసం తీసుకొచ్చామని, ఇది విజయవంతం కావడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. జాస్పర్‌ ఇండస్ట్రీస్‌ను ఆయన అభినందించారు. జాస్పర్‌ ఇండస్ట్రీస్‌ అధినేత బాడిగ రామకృష్ణ మాట్లాడుతూ రతన్‌ టాటా విజయవాడ నగరానికి వస్తారని తనకు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని, ఆయన రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో టాటా గ్రూప్‌ ఉపాధ్యక్షుడు రవికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

More from DriveSpark

Article Published On: Sunday, August 21, 2011, 13:24 [IST]
English summary
After unveiling the car three years at the Auto Expo, Ratan Tata, Chairman, Tata Motors will hand over the keys of the Nano to its customers directly.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+