నీటితో నడిచే కారు రూపకల్పనలో టాటా గ్రూపు పాత్ర..!

నీటి శక్తితో నడిచే కారును తయారుచేసేందుకు టాటా గ్రూప్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. అమెరికాలోని మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ వాటర్ కార్‌ను రూపోందిస్తోంది. ఇందుకు గానూ రతన్ టాటా 1.50 కోట్ల అమెరికా డాలర్లను పెట్టుబడిగా వెచ్చించినట్లు సమాచారం. నీటిలో ఉండే హైడ్రోజన్ ,ఆక్సిజన్‌లను విడగొట్టడం ద్వారా వచ్చే శక్తితో కారు నడిచేలా రూపకల్పన చేస్తున్నారు. (ఒకరకంగా చెప్పాలంటే ఆవిరి యంత్రాల మాదిరిగా అన్నమాట). ప్రస్తుతం ఈ కారు ప్రయోగ దశలో ఉంది. ఇది గనుక విజయవంతమైతే.. దాదాపు ఇంధన కొరతను అధిగమించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంచితే.. చమురు నిల్వలు అంతంత మాత్రంగా ఉన్న మన దేశంలో ఇలాంటి ప్రత్యామ్నాయం వస్తే మంచిదే కానీ.. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాలలో చమురు దొరికినంతగా విరివిగా నీరు దొరకటం లేదన్న సంగతి జగమెరిగన సత్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో టాటా కల సాకారమవుతుందో లేక కల్లలుగా మిగిలిపోతుందే కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications








