ఆర్‌బిఐ వడ్డీ రేట్ల పెంపుతో ఆటో సెక్టార్ డిమాండు ఢమాల్..!

"ఇది (వడ్డీ రేట్ల పెంపు) ఊహించినదే.. ఇది ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వినియోగదారులపై బ్యాంకులు ఎంత భారాన్ని మోపనున్నాయో వేచి చూడాల"ని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో & ఫామ్ ఎక్విప్‌మెంట్ ప్రెసిడెంట్ పవన్ గోయెంకా వెల్లడించారు. ఈయన భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘాని(ఎస్ఐఏఎమ్)కి కూడా అధ్యక్షుడు. కాగా.. మార్చి 2010 తర్వాతి నుంచి ఇప్పటి వరకూ ఇలా ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచడం ఇది పదవసారి.
ఇప్పటికే మార్కెట్ మందకొడిగా సాగుతోందని, తాజా పెంపు ఆటో రంగంపై మరింత భారాన్ని మోపుతుందని, అది ఆందోళకర విషయమని జనరల్ మోటార్స్ ఇండియా వైస్-ప్రెసిండెంట్ (కార్పోరేట్ అఫైర్స్) ఏ బాలేంద్రన్ అన్నారు. అధిక ఇన్‌పుట్ కాస్ట్, పెరుగుతున్న ఇంధన ధరలు మరియు నానాటికీ పెరుగుతున్న వడ్డీ రేట్లు అమ్మకాలపై వ్యతిరేక ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు.
మరో ఆటోమొబైల్ సంస్థ ఫియట్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమపై ఆర్‌బిఐ తీసుకున్న చర్యలు పరిశ్రమను బాధిస్తాయని, దీని వల్ల విక్రయాలు కూడా మందగిస్తాయని ఫియట్ ఇండియా అధ్యక్షుడు మరియు ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కపూర్ తెలిపారు.రాజ్‌కోట్‌కు చెందిన అతుల్ ఆటో డైరెక్టర్ విడయ్ కేడియా స్పందిస్తూ.. ఆర్‌బిఐ కఠిన చర్యలు ఖచ్చితంగా ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రభావం చూపుతాయని, ఫలితంగా వాహన డిమాండు మందగిస్తుందని అన్నారు.


Click it and Unblock the Notifications








