వరుసగా 11వ సారి కూడా వడ్డీ రేట్లను పెంచిన ఆర్‌బిఐ

RBI
మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) వరుసగా మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. ఎంతకీ దిగిరాని ద్రవ్యోల్బణం అంతు చూసేందుకు వడ్డీ రేట్ల వడ్డింపుతో ఆర్‌బిఐ సామాన్యుల నడ్డి విరిచింది. ఈ మేరకు కీలక వడ్డీ రేట్ల (కీ రేట్స్)ను 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. కాగా.. గతేడాది మార్చి 2010 నుంచి ఆర్‌బిఐ ఇలా కీల వడ్డీ రేట్లను పెంచడం వరసుగా ఇంది 11వసారి.

నేడు జరిగిన రిజర్వు బ్యాంకు ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంలో ఆర్‌బిఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆర్‌బిఐ తాజా వడ్డింపుతో రెపో రేటు (రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు) 7.5 శాతం నుంచి 8 శాతానికి మరియు రివర్స్‌ రెపో రేటు (డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటు) 6.5 శాతం 7 శాతానికి పెరిగాయి. అయితే, సీఆర్‌ఆర్‌ (క్యాష్ రిజర్వ్ రేషియో) లో మాత్రం ఎటువంటి మార్పు లేకుండా 6 శాతంగానే ఉంది.

కాగా.. భారతీయ రిజర్వు బ్యాంక్ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 6 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2011 - మార్చి 2012)లో భారత ఆర్థికాభి వృద్ధిరేటు 8 శాతంగా నమోదవ్వచ్చని ఆర్‌బిఐ అంచనా వేసింది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో.. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు తమ వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు, ఆ భారాన్ని ప్రజలపై మోపనున్నారు. దీంతో వాహన, గృహ రుణాలు మరింత ప్రియం కానున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, July 26, 2011, 12:25 [IST]
English summary
To curb sticky inflation, Reserve Bank of India (RBI) today hiked repo rate and reverse repo rate in its monetary policy review. This is the 11th consecutive hike since March 2010.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+