ఆర్‌బిఐ వడ్డింపుతో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఆందోళన

Auto Industry Fall
భారతీయ రిజర్వ బ్యాంకు (ఆర్‌బిఐ) మరోసారి వడ్డీ రేట్లను పెంచడంతో భారత ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళనలో పడ్డాయి. అసలే విక్రయాలు తగ్గి మందకొడిగా సాగుతున్న ఆటో పరిశ్రమపై ఆర్‌బిఐ తాజా వడ్డింపు గోటిపుండుపై రోకలి పోటుగా మారింది. గత మార్చి 2010 నుంచి ఇప్పటి వరకూ ఆర్‌బిఐ ఇలా వడ్డీ రేట్లను పెంచడం వరుసగా ఇది 11వసారి. ఆర్‌బిఐ తన కీలక వడ్డీ రేట్లను పెంచడంతో వాహన మరియు గృహ రుణాలు మరింత భారం కానున్నాయి. దీంతో ఫైనాన్సులో కారు కొనుక్కోవాలనుకు వారి కల కలగానే మిగిలిపోనుంది.

ఓవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పెరుగుతుంటే.. వాహన పరిశ్రమ వృద్ధి రేటు మాత్రం తగ్గుతుండటం గమనార్హం, ఇది కూడా పెరగాలని హోండా సియోల్‌ కార్స్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్, మార్కెటింగ్‌) జ్ఞానేశ్వర్‌ సేన్‌ అన్నారు. అలాగే, ఆర్‌బిఐ వడ్డీ రేట్ల పెంపుపై జనరల్ మోటార్స్ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ పి.బాలేంద్రన్‌ స్పందిస్తూ.. ఈసారి రెపో రేటులో మార్పు ఉండదని భావించాం. కానీ ఆర్‌బీఐ ప్రాధాన్యాలు వేరుగా ఉన్నాయి. ఇప్పటికే కార్ల అమ్మకాల వృద్ధిరేటు తగ్గింది. తాజా పెంపు అమ్మకాలపై మరింత ప్రభావాన్ని చూపుతుందని అన్నారు.

దేశీయ అగ్రగామి ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా సిఎఫ్ఓ స్పందిస్తూ.. మార్కెట్‌ సెంటిమెంట్‌ ఇప్పటికే బలహీనంగా ఉంది. దీనికితోడు ఆర్‌బిఐ తీసుకున్న తాజా నిర్ణయంతో పెరిగనున్న బ్యాంకు వడ్డీ రేట్లు కొనుగోలుదారులను కార్లకు మరింత దూరం చేసే అవకాశం ఉందని చెప్పారు. వాస్తవానికి ఈ పండుగ సీజన్‌కు కార్ల అమ్మకాలు పెరగాల్సి ఉంది. అయితే, రిజర్వు బ్యాంక్ వడ్డీ వడ్డన కారణంగా కొత్త కారును కొనుక్కోవాలనుకు వారు వెనక్కు తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 27, 2011, 12:18 [IST]
English summary
The Indian car market faced another difficult yesterday after the Reserve Bank of India increased its lending rate by 50 repo points. This will effectively increase interest rates for car loans by 0.5 per cent. With most car sales happening through bank loans, the increased interest rate is bound to have an effect on car sales.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+