మారుతి సుజుకి చైర్మన్‌కు భార్గవకు అరుదైన అవార్డ్

RC Bharhava
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) చైర్మన్‌ ఆర్‌.సి భార్గవకు అరుదైన సత్కారం లభించింది. భారత్‌, జపాన్‌ దేశాల ఆర్థిక, ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాల అభివృద్ధికి మరియు పరస్పర అవగాహనకు తోడ్పడినందుకు ఆర్.సి భార్గవకు "ది ఆర్డర్‌ ఆఫ్‌ ది రైజింగ్‌ సన్‌, గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ స్టార్" అవార్డతో జపాన్ ఆయనను సత్కరించింది.

ఈ మేరకు జపాన్‌ దౌత్య కార్యాలయం ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. జపాన్‌ దౌత్య కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నవంబర్ 7వ తేదీన టోక్యోలోని ఇంపీరియల్‌ ప్యాలెస్‌‌లో ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. పాన్ చక్రవర్తి ఈ అవార్డును భార్గవకు అందజేయనున్నారు. 1875వ సంవత్సరం నుంచి పాన్‌ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేస్తూ వస్తుంది.

జపనీయులు లేదా విదేశీయులు వ్యక్తిగతంగా సాధించిన ప్రతిభాపాటవాలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రధానం చేయడం అప్పటి నుండి పరిపాటిగా వస్తుంది. "మారుతిలో పని చేస్తున్న సమయంలో అతను భారత్‌కు జపాన్ యాజమాన్య శైలిని, జపనీస్‌ తయారీ సంస్కృతిని పరిచయం చేశార"ని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అంతేకాకుండా.. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసేందుకు మరియు విస్తరించుకునేందుకు భార్గవ ఎంతగానో కృషి చేశారని, జపాన్‌ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన విలువైన సేవలందించారని, జపాన్ ప్రశంసించింది. 1985లో మారుతీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ (ప్రస్తుత మారుతి సుజుకి పాత పేరు)లో భార్గవ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించబడ్డారు.

అనంతరం 1990లో ఆయన సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతలను చేపట్టారు. 1992 వరకూ ఈ పదవిలోనే కొనసాగిన భార్గవను సంస్థకు సంబంధించిన వ్యవహారాల లావాదేవీలు పూర్తి స్థాయిలో పర్యవేక్షించే నిమిత్తం ఆయన్ని తిరిగి 2003లో సుజుకి బోర్డులో నియమించడం జరిగింది. ఆ తర్వాత 2007లో భార్గవ తిరిగి చైర్మన్‌ పదవిని సొంతం చేసుకున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, November 4, 2011, 13:40 [IST]
English summary
Maruti Suzuki India (MSI) Chairman R C Bhargava has been awarded the 'The Order of the Rising Sun, Gold and Silver Star' by The Emperor of Japan for his contribution to the promotion of economic and bilateral relations between Japan and India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+