రీకాల్ ఎఫెక్ట్: బిఎస్ఈలో దిగజారిన మారుతి సుజుకి స్టాక్స్

నవంబర్ 13, 2010 నుంచి డిసెంబర్ 4, 2010 మధ్యలో తయారైన 13,157 యూనిట్ల స్విఫ్ట్ డిజైర్, స్విఫ్ట్, రిట్జ్ డీజిల్ కార్ల ఇంజన్‌లలో 'కనెక్టింగ్ రాడ్ బోల్ట్'ను కంపెనీ తనిఖీ చేసేందుకు వీటిని రీకాల్ చేస్తున్నట్లు బుధవారం సాయంత్రం మారుతి సుజుకి ప్రకటించిన సంగతి తెలిసిందే. కంపెనీ ప్రకటన కారణంగా అదే రోజు సాయంత్రం బిఎస్ఈలో మారుతి సుజుకి స్టాక్స్ 1.4 శాతం క్షీణించి రూ. 1294.65కు పడిపోయాయి. అలాగే ఎన్ఎస్ఈలో 1.02 శాతం క్షీణించి రూ. 1297.50కు పడిపోయాయి.


Click it and Unblock the Notifications








