రీనాల్ట్ ఫ్లూయెన్స్ డీజిల్ వేరియంట్‌లో ఫెస్టివ్ ఎడిషన్

గత మే నెలలో విడుదలైన ఈ ప్రీమియం సెడాన్ ధరలు అప్పట్లో.. పెట్రోల్ వెర్షన్ ఫ్లూయెన్స్ ధర రూ. 14,55,812 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) గానూ, డీజిల్ వెర్షన్ ధర రూ. 13,12,306 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) గానూ ఉన్నాయి. 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగిన ఫ్లూయెన్స్ కారు లీటరుకు 13.42 కి.మీ. మైలేజ్‌ను అలాగే.. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగిన ఫ్లూయెన్స్ కారు లీటరుకు 21.8 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
ఫ్లూయెన్స్ సెడాన్‌ను చెన్నైకు సమీపంలోని రీనాల్ట్-నిస్సాన్ ఒరగాడం అసెంబ్లింగ్ ప్లాంటులో కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్(సికెడి) రూపంలో దిగుమతి చేసుకొని కంపెనీ అసెంబ్లింగ్ చేస్తోంది. ఫ్లూయెన్స్ కారులో 4 ఎయిర్ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ కారు సొంతం. టొయోటా 'కరోలా' సెడాన్ మరియు ఫోక్స్‌వ్యాగన్ 'జెట్టా' సెడాన్‌లకు రీనాల్ట్ ఫ్లూయెన్స్ గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








