రిమోట్ కంట్రోల్ ట్రాక్టర్‌ను విడుదల చేయనున్న సోనాలికా

Remote Control Tractor
దేశీయ వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవాలకు తెర లేపుతూ.. ట్రాక్టర్ మరియు వ్యవసాయ పరికరాలను తయారు చేసే సోనాలికా గ్రూప్ మరో వినూత్న ఉత్పత్తితో ముందుకు వచ్చింది. రిమోట్ ద్వారా నియంత్రించే ఓ కొత్త ట్రాక్టర్ మోడల్‌ను సోనాలికా అభివృద్ధి చేస్తోంది. ఎండ, చలి, వర్షం వంటి వివిధ వాతావరణ పరిస్థితుల్లో పొలాల్లో పనులు చేసేందుకు వీలుగా కంపెనీ ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేసింది. మరో ఆరు నెలల్లో ఈ మోడల్ మార్కెట్లోకి రావచ్చునని అంచనా వేస్తున్నారు. సోనాలికా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ, భారత్‌లోని టాప్ 3 ట్రాక్టర్ కంపెనీలలో ఒకటైన ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ఐటిఎల్) ద్వారా ఈ ట్రాక్టర్‌ను తయారు చేయనున్నారు.

"రిమోట్ కంట్రోల్‌తో నడిచే ఓ ట్రాక్టర్‌ను మేము డిజైన్ చేస్తున్నాం. రైతులు తమ పొలం సాగు చేసుకునేటప్పుడు గంటలకొద్దీ ఎండలో కష్టపడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ రిమోట్ కంట్రోల్ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇది రైతుల సమయాన్ని మరియు శక్తిని ఆదా చేయడమే కాకుండా, వారి ఆరోగ్యానికి కూడా మంచిది. వచ్చే ఆరు నెలల్లో దీన్ని విడుదల చేయగలమని అంచనా వేస్తున్నామ"ని సోనాలికా గ్రూప్ చైర్మన్ ఎమ్.డి. మిట్టల్ తెలిపారు.

ఈ కొత్త ట్రాక్టర్ ద్వారా రైతులు నీడలో కూర్చునే ఓ ప్రత్యేక పరికరం లేదా వారి మొబైల్ ఫోన్ ద్వారానే ట్రాక్టర్‌ను నియంత్రిస్తూ పొలం పనులు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో టెలిఫోన్ నెట్‌వర్క్ మరింత విస్తరించగలదని మిట్టల్ చెప్పారు, ప్రస్తుతం ఐటిఎల్ 30-40 హెచ్‌పి సామర్థ్యం కలిగిన ట్రాక్టర్లను తయారు చేస్తోంది. అలాగే. భవిష్యత్తులో మరింత అధిక శక్తి మరియు మైలేజ్‌ను ఇచ్చే మరిన్ని మోడళ్లను కంపెనీ అభివృద్ధి చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, July 15, 2011, 13:22 [IST]
English summary
Sonalika Group the manufacturer of the Rhino SUV and several farm equipment and tractors is developed a new tractor that can be controlled using a remote. This new remote controlled tractor has been designed to be used in tough weather conditions such as extreme heat, heavy rains and cold. Sonalika is expected to launch its new tractor within the next six months.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+