నానో, బజాజ్ యూఎల్‌సి చవక కార్లకు పోటీగా రీనాల్ట్ చిన్న కారు..!?

ఇదిలా ఉండగా..రీనాల్ట్ సంస్థ ప్రత్యేకంగా మరో చిన్న కారును రూపొందిస్తుంది. బజాజ్ విడుదల చేయబోయే చిన్న కారు కన్నా ఇది కొంచెం అధిక ధర కలిగి ఉండేలా రీనాల్ట్ ఈ కారును ప్రవేశపెట్టబోతుంది. మరో మూడేళ్లలో రీనాల్ట్ కాంపాక్ట్ కార్ రహదారలుపై హల్‌చల్ చేయనుంది. తమ చిన్న కారు కన్నా బజాజ్ చిన్న కారే చవకగా ఉంటుందని రీనాల్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) జెరోమ్ స్టోల్ తెలిపారు. కాగా.. బజాజ్ చిన్న కారు మార్కెట్లో అందుబాటులోకి రావడానికి మరో ఏడాది సమయం పట్టవచ్చునని అంచనా. అయితే రీనాల్ట్ చిన్న కారు మాత్రం ప్రస్తుతం చర్చల స్థాయిలోనే ఉందని, ఇప్పటికిప్పుడు దీనిని కార్యరూపంలో పెట్టే ఆలోచన లేదని ఆయన సూచించారు.
మరోవైపు 2011-2013 నాటికి భారత మార్కెట్లో మరో ఐదు సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని రీనాల్ట్ భావిస్తుంది. ఈ ఏడాది ముగింపు నాటికి దేశీయ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, ఫ్లూయెన్స్, కోలియోస్ ఎమ్‌యూవీలను ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించుకుంది. భారత కార్ మార్కెట్‌కు మరో చిన్న కారును భరించే శక్తిసామర్థ్యాలున్నాయని, తాము ప్రవేశపెట్టాలనుకునే కారు ఎంతో ఆకర్షనీయంగా ఉంటుందని స్టోల్ తెలిపారు. రీనాల్ట్ తన ప్రపంచ మార్కెట్‌ను విస్తరించుకోవడానికి బ్రెజిల్, రష్యాల తర్వాత భారత్ మాత్రమే పటిష్ట మార్కెట్ కావడం విశేషం.


Click it and Unblock the Notifications








