డస్టర్‌ ఎస్‌యూవీతో దుమ్ము లేపేందుకు సిద్ధమైన రీనాల్ట్

Renault Duster SUV
ఫ్లూయెన్స్ సెడాన్, కొలియోస్ ఎస్‌యూవీలను విజయవంతంగా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ రీనాల్ట్ ఇప్పుడు తాజా మరో ఎంట్రీ-లెవల్ ఎస్‌యూవీ "డస్టర్"ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి డస్టర్ ఎస్‌యూవీ దేశీయ విపణిలోకి విడుదల చేయాలని రీనాల్ట్ యోచిస్తోంది.

డస్టర్ ఎస్‌యూవీని పూర్తిగా భారత్‌లోనే తయారు చేసి ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు వీలుగా భారత్‌ను ఎస్‌యూవీ కోసం ఎక్స్‌పోర్ట్ హబ్‌గా ఉపయోగించుకోనుంది. ఇలా ఎస్‌యూవీ కోసం భారత్‌ను ఎక్స్‌పోర్ట్ హబ్‌గా వాడుకోనున్న తొలి ఫారిన్ కంపెనీగా రీనాల్ట్ నిలువనుంది.

డస్టర్ ఎస్‌యూవీ భారత్‌లో తయారు చేయడం వలన దీని ధర కూడా తక్కువగా ఉండే ఆస్కారం ఉంది. దీని రూ.8 నుంచి రూ.10 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. మహీంద్రా అండ్ మహీంద్రా ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ అయిన బొలెరో, స్కార్పియోలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

డస్టర్ కోసం యూకేతో సహా కుడిచేతివైపు డ్రైవింగ్ కలిగిన అన్ని మార్కెట్లకు భారత తయారీ హబ్‌గా ఉండనుంది. డస్టర్ ఎస్‌యూవీ ఉత్పత్తి ప్రారంభించిన తొలి సంవత్సరంలో 50,000 ఉత్పత్తి చేయాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రీనాల్ట్‌కు డస్టర్ ఎస్‌యూవీ భారత్‌లో మూడో ఉత్పత్తి మాత్రమే కాకుండా ప్రస్తుతం ఉన్న రెండు ఉత్పత్తుల కన్నా చవకైనది కానుంది. రీనాల్ట్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఫ్లూయెన్స్ ధర రూ.14 లక్షలకు పైగా ఉంటే, తాజాగా మార్కెట్లోకి వచ్చిన ప్రీమియం ఎస్‌యూవీ కొలియోస్ ధర రూ. 22 లక్షలకు పైగా ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 13, 2011, 11:23 [IST]
English summary
Renault, the French carmaker is planning to make India the exclusive exporter of its right hand drive SUV Duster. The Renault Duster could be launched in India soon. The Duster is considered as a low cost SUV in Europe and will offer four wheel drive.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+