2013 నాటికి 11వ అతిపెద్ద మార్కెట్‌గా భారత్: రీనాల్ట్ అంచనా

Renault
భారత ఆటోమొబైల్ రంగం కనబరుస్తున్న ప్రోత్సాహకర వృద్ధి.. మన దేశాన్ని అగ్రదేశాల సరసన నిలుపనుంది. ఇప్పటికే పలు విదేశీ కంపెనీలు భారత ఆటో మార్కెట్‌పై భారీ అంచనాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రీనాల్ట్ కూడా భారత ఆటో మార్కెట్‌పై భారీ అంచనాలను వ్యక్తం చేసింది. 2013 నాటికి భారత ఆటోమొబైల్ రంగం 20 స్థానాలను అధిగమించి ప్రపంచంలోనే 11వ అతిపెద్ద మార్కెట్‌గా నిలవగలదని రీనాల్ట్ అంచనా వేసింది. ఆ సమయానికి రీనాల్ట్ పూర్తిగా భారత్‌లో రూపొందించిన ఆరు మోడళ్లను విక్రయించాలని భావిస్తోంది.

బ్రెజిల్, రష్యా, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న కీలక మార్కెట్లను పరిశీలించినట్లయితే.. గడచిన మూడేళ్లలో ఒక్క భారత్‌లోనే అమ్మకాల వృద్ధి తొమ్మిది రెట్లు పెరిగందని, చూస్తుంటే భారత్ 20 స్థానాలను అధిగమించి 11వ స్థానంలో నిలుస్తుందని రీనాల్ట్ ఛైర్మన్ సీఈఓ కార్లోస్ ఘోస్న్ పేర్కొన్నారు. 2013 నాటికి ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2010లో ప్రపంచవ్యాప్తంగా కంపెనీ 26 లక్షల కార్లను విక్రయించే. అయితే ప్రస్తుతం భారత మార్కెట్లో రీనాల్ట్ స్థానికంగా రూపొందించిన ఎలాంటి కార్లను విక్రయించడం లేదు.

More from DriveSpark

Article Published On: Monday, February 14, 2011, 16:00 [IST]
English summary
With an aggressive focus on emerging economies, French car-maker Renault expects India to gain 20 places to become its 11th largest market by 2013, by which time it will sell six locally produced models.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+