ఏడుకొండల స్వామికి లగ్జరీ కారును సమర్పించిన కంపెనీ

Renault Fluence
మన దేవుళ్లలో అత్యున్నత స్థాయిలో సేవలు పొందుతున్న భగవంతుడు శ్రీ ఏడుకొండల వెంటేశ్వర స్వామి. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఎల్లప్పుడూ భక్తులతో కలకలలాడుతుండే శ్రీవారికి విదేశీ కార్ల కంపెనీ ఓ లగ్జరీ కారును బహుకరించారు. ఫ్రాన్స్‌కు చెందిన రీనాల్ట్ కంపెనీ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన తమ తొలి లగ్జరీ కారు 'ఫ్లూయెన్స్'ను గత ఆదివారం ఉదయం రీనాల్ట్ కంపెనీ తరఫున, రాష్ట్ర అధికార ప్రతినిధి జి. భానుప్రకాష్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాని (టిటిడి)కి బహుమతిగా ఇచ్చారు. ఈ కారు విలువ సుమారు రూ. 15 లక్షలుగా ఉంది. వేదపండితులతో కారుకు శాస్త్రపరంగా పూజలు నిర్వహించిన తర్వాత కారు తాళాలను తిరుమల దేవస్థానం జే.ఈ.వో. శ్రీనివాస రాజుకు భానుప్రకాష్ రెడ్డి అందజేశారు.

ఇక రీనాల్ట్ విషయానికి వస్తే.. భారత్‌లో హహీంద్రా జాయింట్ వెంచర్ నుంచి విడిపోయిన తర్వాత భారత మార్కెట్లో సొంతంగా అందిస్తున్న మొట్టమొదటి విలాసవంతమైన కారు 'రీనాల్ట్ ఫ్లూయెన్స్'. మే 20, 2011వ తేదీన ఈ కారను రీనాల్ట్ భారత్‌లో విడుదల చేసింది. ఈ కారును విడిభాగాలుగా ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకొని (కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్) చెన్నైలో సమీపంలోని ఒరగాడం అసెంబ్లింగ్ ప్లాంటులో కంపెనీ అసెంబ్లింగ్ చేస్తుంది. 4 ఎయిర్ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో లభించే ఈ కారు టొయోటా 'కరోలా' సెడాన్ మరియు ఫోక్స్‌వ్యాగన్ 'జెట్టా' సెడాన్‌లకు గట్టి పోటీగా నిలవనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 21, 2011, 17:39 [IST]
English summary
A Renault Fluence has been donated to the Tirumala Tirupati Devastanams (TTD), the administrative board governing the abode of Lord Venkateshwara. Bhanu Prakash Reddy, the BJP spokesperson in Andhra Pradesh, on behalf of the French carmaker handed over the keys of the Renault Fluence to K.S.Srinivasa Raju, Joint Executive Officer, TTD. The Luxury sedan is worth Rs.15 lakh and was launched in India recently.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+