వచ్చే ఏడాది చివరి నాటికి 100 డీలర్‌షిప్ కేంద్రాలు: రీనాల్ట్

Renault
గత వారం భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రీనాల్ట్ దేశీయ మార్కెట్లో యుద్ధప్రాతిపదికన విస్తరణ ప్రణాళికలను రూపొందిస్తుంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 100 డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం రీనాల్ట్ కు దేశవ్యాప్తంగా 14 ఔట్‌లెట్లున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 40 డీలర్లను, అలాగే 2012 చివరి నాటికి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 75 నగరాల్లో 100 డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని రీనాల్ట్ ఇండియా ఉపాధ్యక్షుడు (సేల్స్ అండ్ మార్కెటింగ్) లెన్‌ కుర్రాన్‌ తెలిపారు.

విదేశీ మార్కెట్లో కంపెనీ అందిస్తున్న హై-ఎండ్ వేరింయట్ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటా వాహనం) కొలియెస్‌ ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడుదల చేస్తామని, అలాగే వచ్చే సంవత్సరం ఓ బి-సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్‌ కారుతో సహా మరో మూడు మోడళ్లను కూడా విడుదల చేస్తామని లెన్ తెలిపారు. యూరప్‌లో రెండో అతిపెద్ద కార్ల తయారీదారు అయిన రీనాల్ట్ రానున్న సంవత్సరాలలో భారత్‌లో మరిన్ని మోడళ్లను విడుదల చేయాలని, వీలైనంత వరకూ వాటిని భారత్‌లోనే ఉత్పత్తి/అసెంబ్లిగ్ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం రీనాల్ట్ అందిస్తున్న లగ్జరీ సెడాన్ ఫ్లూయెన్స్ కారును టైర్‌ -1 నగరాల నుంచి టైర్‌ -2, టైర్‌-3 నగరాలకు కూడా విస్తరించనుంది.

More from DriveSpark

Article Published On: Sunday, May 29, 2011, 11:43 [IST]
English summary
French carmaker Renault will have 100 dealerships by the end of 2012 from the existing 14 dealer outlets. "We are looking seriously towards India, which is amongst the top three strategic markets for us. We shall have 40 dealers by end of this year and ramp it up to 100 by 2012 end, when our five models shall be on Indian roads," Renault India Vice President, Sales and Marketing, Len Curran said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+