భారత మార్కెట్ కోసం రీనాల్ట్ చిన్న కారు

ఈ మూడు ఉత్పత్తుల్లో తొలుతగా ఓ చిన్న కారును ఈ ఏడాది దేశీయ విపణిలోకి విడుదల చేయనున్నామని, వచ్చేడాది మే-జూన్ నాటికి తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ డస్టర్‌ను అలాగే, వచ్చే ఏడాది చివరి నాటికి ఓ మిడ్-సైజ్ సెడాన్ కారును విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
రీనాల్ట్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన కొలియోస్ ఎస్‌యూవీని కేరళ మార్కెట్లో విడుదల చేస్తున్న సందర్భంగా ఈ విషయాన్ని ఆయన విలేఖరులతో ప్రస్తావించారు. ప్రస్తుతం రీనాల్ట్ దేశవ్యాప్తంగా 14 డీలర్‌షిప్‌లు ఉన్నాయి.
ఈ ఏడాది చివరి నాటికి వీటి సంఖ్యను 40కు, వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి 70కు పెంచుకోవాలని భావిస్తున్న కంపెనీ పేర్కొంది. రీనాల్ట్ తన ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ కొలియోస్‌ను తొలిసారిగా భారత మార్కెట్లోనే విడుదల చేసింది.


Click it and Unblock the Notifications








