కొలియోస్ టీజర్ వెబ్‌సైట్‌ను విడుదల చేసిన రీనాల్ట్

భారత్‌లో కొత్తగా కార్యకాలాపాలు ప్రారంభించిన రీనాల్ట్ ఉత్పత్తుల విషయంలో ఆచి తూచి అడుగులేస్తోంది. భారత మార్కెట్లో ఐదు మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన రీనాల్ట్ అందులో తొలుతగా ఓ ఎస్‌యూవీని భారతీయ వినియోగదారులకు పరిచయం చేయనుంది.
కొలియోస్ ఎస్‌యూవీకి సంబంధించిం రీనాల్ట్ తన ఇండియా వెబ్‌సైట్‌లో ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. వచ్చే సెప్టెంబర్ చివరి నాటికి లేదా అక్టోబర్ ఆరంభంలో ఈ కారు మార్కెట్లోకి రానుంది. కొలియోస్ ఎస్‌యూవీ ధర భారత మార్కెట్లో రూ. 20 లక్షలకు దిగువన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఇందులో ఉండబోయే ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే..
* 2 లీటర్ సిఆర్‌డి ఇంజన్
* 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్
* 4×4 ఇంటలిజెంట్ డ్రైవ్ (ఫోర్-వీల్/ఆల్-వీల్ డ్రైవ్)
* బోస్ సౌండ్ ఆడియో సిస్టమ్
* లెథర్ సీటింగ్ అండ్ ఇంటీరియర్స్
* క్రూయిజ్ కంట్రోల్ అండ్ స్పీడ్ లిమిటర్


Click it and Unblock the Notifications








