భారత్ కోసం ప్రత్యేకంగా చిన్నకారు: రీనాల్ట్

Renault New Car
ఫ్రెంచ్ కార్ల దిగ్గజం రీనాల్ట్ ఇండియా చెన్నైలో ఏర్పాటు చేస్తున్న ఇంజన్ ప్లాంట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 2012 నాటికి పూర్తిస్థాయిలో నిర్వహణలోకి రానున్నట్లు కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్లాంటులో తయారయ్యే ఇంజన్‌లను కంపెనీ కొత్తగా విడుదల చేయనున్న హ్యాచ్‌మోడల్ కోసం ఉపయోగించనున్నారు. జనవరిలో విడుదల కానున్న ఈ హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారును ప్రపంచంలో మరెక్కడా లేకుండా ప్రత్యేకించి భారత మార్కెట్ కోసం మాత్రమే కంపెనీ రూపొందించనుంది. త్వరలో మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌లకు ఇది గట్టి పోటీ ఇస్తుందని కంపెనీ భావిస్తోంది.

"మా ఇంజన్ ప్లాంట్ వచ్చే ఏప్రిల్ నాటికి ప్రారంభం కానుంద"ని రీనాల్ట్ ఇండియా వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) లెన్ కుర్రాన్ తెలిపారు. ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 1,00,000 యూనిట్లుగా ఉన్నట్లు ఆయన వివరించారు. పూణేలోని రీనాల్ట్ తొలి డీలర్‌షిప్ కేంద్రంలో తమ తొలి లగ్జరీ ఫ్లూయెన్స్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వీ-ఫ్లాట్‌ఫామ్‌పై నిర్మించినున్న ఈ హ్యాచ్‌బ్యాక్ కారును పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో కంపెనీ అందించనుంది.

వచ్చే ఏడాది కంపెనీ విడుదల చేయనున్న మూడు ఉత్పత్తులలో ఈ హ్యాచ్‌బ్యాక్ కూడా ఒకటి. ప్రస్తుతం భారత మార్కెట్లో రీనాల్ట్ ఒకే ఒక్క మోడల్ (ఫ్లూయెన్స్)ను మాత్రమే అందిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో రీనాల్ట్ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) కొలియోస్‌ను కూడా విడుదల చేయనుంది. ఈ మోడల్‌ను కూడా ఫ్లూయెన్స్ మాదిరిగానే సికిడె యూనిట్లుగా దిగుమతి చేసుకొని భారత్‌లోని చెన్నై ప్లాంటులో అసెంబ్లింగ్ చేయనుంది. కాగా.. ఈ హ్యాచ్‌బ్యాక్ కారును మాత్రం పూర్తిగా భారత్‌లోనే ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, July 22, 2011, 12:05 [IST]
English summary
French car maker Renault India said its engine plant in Chennai will be operational by April 2012. The engines produced at this plant will be used in the company's soon to be launched India specific small car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+