రాష్ట్ర మార్కెట్లోకి అడుగుపెట్టిన రీనాల్ట్ ఫ్లూయెన్స్ సెడాన్

రీనాల్ట్‌కు చెన్నైలో సమీపంలోని ఒరగాడం అసెంబ్లింగ్ ప్లాంటులో తయారైన మొట్టమొదటి బ్రాండ్ ఇది. ఈ కారును కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్(సికెడి) రూపంలో (విడిభాగాలను భారత్‌కు దిగుమతి చేసుకొని దేశీయంగా అసెంబ్లింగ్ చేసే విధానం) దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తున్నారు. ఫ్లూయెన్స్ తర్వాత రీనాల్ట్ తన స్పోర్ట్స్ యటిలిటీ వాహనమైన "కొలియోస్"తో పాటు మరో మూడు మోడళ్లను 2012 సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. రీనాల్ట్ ఫ్లూయెన్స్ కారులో 4 ఎయిర్ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ కారు సొంతం. టొయోటా 'కరోలా' సెడాన్ మరియు ఫోక్స్‌వ్యాగన్ 'జెట్టా' సెడాన్‌లకు రీనాల్ట్ ఫ్లూయెన్స్ గట్టి పోటీ ఇవ్వగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.


Click it and Unblock the Notifications








