గ్రాండ్ ప్రిలో 'పల్స్' చిన్న కారును ఆవిష్కరించిన రీనాల్ట్

Renault Pulse
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రీనాల్ట్ భారత మార్కెట్ కోసం రూపొందించిన చిన్న కారు 'రీనాల్ట్ పల్స్'ను దేశీయ వినియోగదారులకు పరిచయం చేసింది. పల్స్ విడుదలకు భారత్‌లో తొలిసారిగా జరిగిన ఫార్ములా వన్ రేస్ ఇండియన్ గ్రాండ్ ప్రిను రీనాల్ట్ వేదికగా చేసుకుంది.

అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో శనివారం నాడు కంపెనీ తమ చిన్న కారును ఆవిష్కరించింది. భారత రహదారులకు అనువుగా రూపొందుతున్న ఈ పల్స్ చిన్న కారును దేశీయ వినియోగదారుల నుండి మంచి ఆదరణ లభించగలదని రీనాల్ట్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ కార్లోస్‌ టవరెస్‌ తెలిపారు.

రానున్న జనవరిలో ఇది మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. దీని ధర మరియు ఇతర వివరాలను ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో వెల్లడిస్తామని కార్లోస్ చెప్పారు. ప్రస్తుతం రీనాల్ట్ పల్స్ చిన్న కారును చెన్నైలోని ఓరగడంలో ఉన్న రీనాల్ట్-నిస్సాన్ ప్లాంటులో అభివృద్ధి చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, October 31, 2011, 14:07 [IST]
English summary
Renault launched its new small car for India, the Pulse on Saturday at the Indian Formula 1 Grand Prix. The event was quite a launch pad that calls itself a small car specially made for India. In fact the Renault Pulse appears to be no more than a twin of the Nissan Micra.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+