లక్ష కార్ల ఉత్పత్తిని సాధించిన రీనాల్ట్-నిస్సాన్

Nissan-Renault
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రీనాల్ట్ మరియు జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ కంపెనీలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడి భారత్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తమ రీనాల్ట్-నిస్సాన్ జేవీ భారత్‌లో ఓ అరుదైన మైలురాయిని అధిగమించినట్లు ఇరు సంస్థలు ప్రకటించాయి.

తమిళనాడులోని ఓరగడం ప్లాంటులో ఈ జేవీ తొలి లక్షల కార్ల ఉత్పత్తి మార్కును తాకింది. చెన్నైలో 2008 సంవత్సరంలో రీనాల్ట్ మరియు నిస్సాన్ కంపెనీలు రూ. 4,500 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంటును నిర్మించాయి. గతేడాదిలో ఈ ప్లాంటులో కార్యకాలాపాలు పూర్థిస్థాయిలో ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా రీనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కోవు కిమురా మాట్లాడుతూ.. "గతేడాది మే నెలలో ఉత్పత్తిని ప్రారంభించాం. అప్పటి నుండి ఇప్పటికీ మేము ఓరగడం ప్లాంటు నుంచి లక్ష కార్లను ఉత్పత్తి చేయగలిగాం. ఇది భారత్‌లోనే అత్యంత వేగంగా లక్ష కార్ల ఉత్పత్తిని సాధించడమ"ని అన్నారు.

ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించిన 13 నెలల్లనే లక్ష కార్ల మార్కును ఈ జేవీ సాధించింది. ఈ ప్లాంటులో నిస్సాన్ మరియు రీనాల్ట్ సంస్థలకు చెందిన కార్లు ఉత్పత్తి అవుతుంటాయి. ఇక్కడ నిస్సాన్ తన చిన్న కారు మైక్రాను ఉత్పత్తి చేస్తుండగా, రీనాల్ట్ తన లగ్జరీ కారు ఫ్లూయెన్స్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 26, 2011, 14:53 [IST]
English summary
Renault and Nissan, the Franco-Japanese alliance has said it has crossed a new milestone in India. The two carmakers have said they have built one lakh cars in their new plant in Oragadam, Tamil Nadu. The carmakers built this new plant near Chennai in 2008 after investing Rs.4,500 and operations began last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+