త్వరలో మూడో షిఫ్టును ప్రారంభించనున్న రీనాల్ట్-నిస్సాన్ జేవీ

ఈ ప్లాంటులో రీనాల్ట్ మరియు నిస్సాన్‌లకు చెందిన ఉత్పత్తులు తయారవుతాయి. ప్రస్తుతం ఈ ప్లాంటు ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యం సాలీనా రెండు లక్షల యూనిట్లు, భవిష్యత్తులో దీన్ని నాలుగు లక్షలకు పెంచనున్నట్లు నాసిఫ్ తెలిపారు. ఇటీవలే రీనాల్ట్ తమిళనాడులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించి, తమ లగ్జరీ సెడాన్ ఫ్లూయెన్స్ కారును విడుదల చేసింది. కాగా.. భారత్‌లో ఇది రీనాల్ట్‌కు 13వ షోరూమ్. నిస్సాన్ త్వరలోనే తమ 14వ షోరూమ్‌ను పూణేలో ప్రారంభించనుంది. డీజిల్ వేరియంట్‌లో లభించే ఫ్లూయెన్స్ లగ్జరీ సెడాన్ ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ చెన్నయ్) మరియు పెట్రోల్ వేరియంట్ లగ్జరీ సెడాన్ ధర రూ. 14.40 లక్షలు (ఎక్స్-షోరూమ్ చెన్నయ్) గానూ ఉంది.


Click it and Unblock the Notifications








