భారత మార్కెట్లో లక్ష కార్లను విక్రయించడమే లక్ష్యం: రీనాల్ట్

Renault-Fluence
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రీనాల్ట్ భారత మార్కెట్లో భారీ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. భారత్‌లో ఏటా లక్ష వాహనాలను విక్రయించాలని రీనాల్ట్ భావిస్తోంది. అంతేకాకుండా ఇప్పటి వరకూ భారత్‌లో వివిధ సంస్థలతో జాయింట్‌ వెంచర్‌లుగా ఏర్పడి కార్యకలాపాలు కొనసాగిస్తున్న రీనాల్ట్ తన స్వంత కార్ బ్రాండ్‌తో రాణించాలనుకుంటోంది. గతేడాది వరకూ భారత్‌లోని ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాతో రీనాల్ట్ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే.

గతేడాది ఢిల్లీలో జరిగిన ఆటో షోలో రీనాల్ట్ ప్రదర్శనకు ఉంచిన "ఫ్లూయెన్స్" సెడాన్ కారును ఈ మే నెలలో భారత్‌కు తీసుకురావాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. అంతేకాకుండా 2012 చివరి నాటికి మరో మూడు మోడళ్లను కూడా ఇక్కడి వినియోగదారులకు పరిచయం చేయాలని ఈ ఫ్రెంచ్ కార్‌మేకర్ కసరత్తులు చేస్తోంది. రీనాల్ట్ ఇండియా డివిజన్‌ను నిర్వహిస్తున్న మార్క్ నాసిఫ్ మాట్లాడుతూ.. కంపెనీ లక్ష యూనిట్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉందని, 2013 నాటికి ఈ విజయాన్ని సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు.

టొయోటా సెడాన్ కారు 'కరోలా' మరియు ఫోక్స్‌వ్యాగన్ సెడాన్ వేరియంట్ 'జెట్టా'లకు తమ ఫ్లూయెన్స్ కారు గట్టి పోటీ ఇవ్వగలదని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో ప్రిమీయం కార్లకు మంచి గిరాకీ ఉన్న నేపథ్యంలో ఫ్యూయెన్స్ కారు ద్వారా దేశీయ మార్కెట్లోకి ప్రవేశిస్తే బాగుంటుందని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడి మార్కెట్లో కంపెనీ అంచనాలు మాత్రం అత్యాశగానే ఉన్నాయనేది విమర్శకుల వాదన.

రీనాల్ట్‌కు భారత్‌లో బ్రాండ్ ఇమేజ్ పెద్దగా లేదు, పైగా విస్తృతమైన డీలర్ నెట్‌వర్క కూడా లేదు. పైగా పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఇంధన ధరలతో ఈ ఏడాది కార్ల విక్రయాలు మందగించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏటా లక్షల వాహనాలు విక్రయించడమంటే సాధ్యమా..!? ఏదైతేనేం మనం కూడా రీనాల్ట్ తమ లక్ష్యాలను సాధించుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుదాం.

More from DriveSpark

Article Published On: Friday, May 20, 2011, 17:35 [IST]
English summary
French carmaker Renault is keen to attain annual sales of one lakh cars in India. Renault is all set for a re-entry in to Indian car market as an independent car brand. Renault had a joint venture with Mahindra and Mahindra until last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+