రీనాల్ట్ చిన్న కారులో సిటీ చుట్టేద్దాం రండి...!

రీనాల్ట్ ట్విజి కారు మొత్తం పొడవు కేవలం 2.32 మీటర్లు మాత్రమే. దీని వెడల్పు 1.19 మీటర్లు మరియు ఎత్తు 1.46 మీటర్లు. సాధారణంగా సిటీ రోడ్లకు ఇది చక్కగా సూట్ అవుతుంది. ఈ కారులో ఇద్దరు ప్రయాణికులు (డ్రైవర్‌తో కలిపి) కూర్చుని ప్రయాణించవచ్చు. ఇది గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
కొన్ని దేశాల్లో అయితే ఈ కారును నడపడానికి లైసెన్సు కూడా అవసరం లేదు. రీనాల్ట్ ట్విజి రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. దీనికి అమర్చిన డిస్క్ బ్రేక్స్ కారును సమర్థవంతంగా ఆపేందుకు ఉపకరిస్తాయి. ఈ కారు మొత్తం బరువు 450 కిలోలు మాత్రమే (బ్యాటరీ 10 కిలోలు కలిపి). దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు.
కేవలం మూడున్నర గంటల్లోనే ట్విజి కారు బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది. టూ-వీలర్‌కు బదులు ఈ బుజ్జి కారును కొనుగోలు చేస్తే.. భద్రతో పాటు సౌకర్యంగా ఈ కారులో సవారీ చేయవచ్చు. మనదేశంలో కూడా త్వరలోనే ఈ కారును ప్రవేశపెట్టాలని రీనాల్ట్ కంపెనీను కోరుకుందాం..!!


Click it and Unblock the Notifications








