ఎలక్ట్రిక్ వాహనంగా మారనున్న మహీంద్రా వాహనం!

అంటే ప్రస్తుతం ఎమ్ అండ్ ఎమ్ అందిస్తున్న స్కార్పియో, జైలో, బొలెరో మొదలగు ఉత్పత్తుల్లో ఏదో ఒకటి ఎలక్ట్రిక్ కారు/ఎస్‌యూవీగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వెహికల్ ఛీఫ్ (టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ) చేతన్ మియానీ మాట్లాడుతూ.. "మరో 18 ఏళ్లలో ఓ ఎమ్ అండ్ ఎమ్ ఉత్పత్తిని ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీతో భారత్‌లో విడుదల చేస్తామ"ని చెప్పారు.
ఇప్పటికే రేవాల ఎలక్ట్రిక్ కార్ టెక్నాలజీను మహీంద్రా వాహనాల్లో ఉపయోంచినట్లు, ప్రస్తుతం అవి టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మహీంద్రా అందిస్తున్న వాహనాల్లో ఏ వాహనాన్ని ఎలక్ట్రిక్ వాహనంగా తీర్చిదిద్దే విషయాన్ని మాత్రం మియానీ వెల్లడించలేదు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, మహీంద్రా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ "స్కార్పియో"ను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








