మహీంద్రా రేవా నుంచి త్వరలో 'ఎన్ఎక్స్ఆర్' ఎలక్ట్రిక్ కార్

ప్రస్తుతం ఈ ప్రోటోటైప్ ఎన్ఎక్స్ఆర్ కారును రేవా బెంగుళూరులో పరీక్షిస్తోంది. ఈ మోడల్‌ను అభివృద్ధి చేయడం దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా.. మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐదు కొత్త మోడళ్లను విడుదల చేస్తానని ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో అందులో ఒక మోడల్ మహీంద్రా రేవా నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. రేవా ఎన్ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ కారును ఒక్కసారిగా పూర్తిగా చార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. ఇది గంటకు గరిష్టంగా 104 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.


Click it and Unblock the Notifications








