రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు ఇంజన్‌లో సమస్యలు..!

కాగా.. ఈ రీకాల్ భారత్‌లో విక్రయించిన కార్లకు కూడా వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే, కంపెనీ విధానాలకు విరుద్ధంగా మొత్తం ఎన్ని కార్లను రీకాల్ చేస్తున్న విషయాన్ని తాము వెల్లడించలేమని, ఇప్పటికే వినియోగదారులుకు ఈ రీకాల్ విషయం గురించి ప్రత్యేకంగా తెలియజేస్తున్నామని రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ లిమిటెడ్ రీజనల్ డైరెక్టర్ పాల్ హ్యారిస్ తెలిపారు.
ఈ సమస్యను సరిచేయడానికి కేవలం ఒకటిన్నర గంట సమయం మాత్రమే సరిపోతుందని ఆయన చెప్పారు. ఈ నెల ఆరంభంలో కూడా రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ అమెరికాలో సెప్టెంబర్ 2009 నుండి సెప్టెంబర్ 2010 మధ్య కాలంలో విక్రయించిన 589 ఘోస్ట్ మోడల్ కార్లను రీకాల్ చేసింది. లోపపూరితమైన సర్క్యూట్ కారణంగా వాటర్‌పంప్ వేడెక్కి కారులో మంటలు చెలరేగే ప్రమాదం ఉందని కంపెనీ పేర్కొంది.
కాగా.. రోల్స్ రాయిస్ ఇటీవలే భారత్‌లో పెద్ద వీల్ బేస్ కలిగిన ఘోస్ట్ మోడల్‌ను విడుదల చేసింది. ఉత్తర భారతదేశంలో రోల్స్‌రాయిస్ ఘోష్ట్ ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్ కారు ధర రూ.3.04 కోట్లుగా ఉండగా, స్టాండర్డ్ ఘోష్ట్ కారు ధర రూ.2.07 కోట్లుగా ఉంది. భారత మార్కెట్లో ఘోస్ట్ మోడల్‌తో పాటుగా ఫాంటమ్ లగ్జరీ కారును కూడా రోల్స్ రాయిస్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications








