భారత్‌లో ఏటా వందకు పైగా కార్లను విక్రయిస్తాం..!!

Rolls Royce
భారత్‌లో సూపర్ లగ్జరీ కార్లకు నానాటికీ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్రతి ఏటా వందకు పైగా కార్లను విక్రయించాలని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ భావిస్తోంది. 2010లో రోల్స్ రాయిస్ భారత మార్కెట్లో 80 కార్లను విక్రయించింది. గతేడాదిలో భారత వినియోగదారుల డిమాండును అందుకోవడంలో బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి పలు లగ్జరీ కార్ల కంపెనీలు విఫలమైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం భారత్‌లో రోల్స్ రాయింట్ ఫాంటమ్, గోస్ట్ అనే రెండు వేరియంట్ల లగ్జరీ కార్లను అందిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 2.5 కోట్లు, 3.5 కోట్ల పైమాటే. భారత విక్రయాలలో 2009లో పోలిస్తే 2010లో 600 శాతం వృద్ధిని సాధించామని, 2011 తమ కంపెనీ విక్రయాలు మూడంకెల సంఖ్యను అధిగమించవచ్చునని రోల్స్ రాయిస్ సీఈఓ టోర్స్‌టెన్ ముల్లర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా తర్వాత రోల్స్ రాయిస్ కంపెనీకు భారత్ రెండవ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్ కావడం విశేషం.

అంతేకాకుండా భారత్‌లో రెండు కొత్త డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఇందుకోసం పంజాబ్, హైదరాబాద్ ప్రాంతాలను పరిశీలిస్తున్నామని ముల్లర్ తెలిపారు. మార్చి 1, 2011 నుంచి జెనీవాలో ప్రారంభం కానున్న జెనీవా మోటార్‌ షోలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ మోడల్‌లో తయారుచేసిన ఎలక్ట్రిక్ కారు '102 ఈఎక్స్'ను కూడా విడుదల చేయనుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 25, 2011, 16:49 [IST]
English summary
With the rise of demand for super premium luxury cars in the Indian market, Rolls Royce is scheming to increase its sale volume to more than 100 units in this year. This comes in the wake of its last year sale of 80 units and the group of BMW statistically revealed that the volume of 2009 for these cars was 600% growth and this could make the volume for 2011 to three digits, said its CEO.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+