దక్షిణాధిలోనే తొలి రోల్స్ రాయిస్ షోరూమ్ హైదరాబాద్‌లో ఏర్పాటు

భారత్‌లో సంపన్న వర్గాల సంఖ్య పెరుగుతున్న తరుణంలో వారికి అతి చేరువలో ఉండేందుకు గానూ తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లను విస్తరిస్తున్నామని, అందులో భాగంగానే ఉత్తరాదిన మరో షోరూమ్‌ను కూడా ప్రారంభించనున్నామని కంపెనీ పేర్కొంది. రోల్స్ రాయిస్‌కు భారత్‌లో ఇది మూడవ షోరూమ్. హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన షోరూమ్‌లో కంపెనీ తాజాగా దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన ఎక్స్‌టెండెడ్ వీల్ బేస్‌తో కూడిన రోల్స్ రాయిస్ ఘోస్ట్ మోడల్‌ను కూడా అందిస్తుంది.
ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ హైదరాబాద్ ధర రూ.3.05 కోట్లు. ఇదివరకటి రోల్స్ రాయిస్ ఘోస్ట్ మోడల్‌తో పోలిస్తే ఇది మరింత విశాలమైన క్యాబిన్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని డ్యాష్‌బోర్డ్ నిర్మాంలో కేరళలో లభించే అరుదైన మలబార్ చెక్కను ఉపయోగించారు. వైడ్ సన్‌రూఫ్, ఊల్ కార్పెట్, 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వంటి ఫీచర్లతో పాటుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కారును తీర్చిదిద్దారు. ఇది 12 ఆకర్షనీమయైన రంగుల్లో లభ్యమవుతుంది.
భారత్‌లో విక్రయించే రోల్స్ రాయిస్ కార్లను కంపెనీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది (సిబియూ రూట్లో). రోల్స్ రాయిస్ బ్రాండ్‌కు హైదరాబాద్‌కు ఓ ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. నిజాంను పరిపాలించిన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్‌ఖాన్ సిద్ధిఖీ అసఫ్ జా సుమారు 50 వరకూ రోల్స్ రాయిస్ కార్లు ఉండేవని కంపెనీ వెల్లడించింది. భారత్‌తో దశాబ్ధాల అనుబంధం కలిగి ఉన్న రోల్స్ రాయిస్ 2005వ సంవత్సరంలో ముంబైలో తమ తొలిని షోరూమ్‌ను ప్రారంభించడం ద్వారా అధికారికంగా దేశీయ విపణిలోకి ప్రవేశించింది.
అప్పటి నుండి ఎంతో మంది భారతీయ ప్రముఖులను తన వినియోగదారులుగా చేసుకుంటూ విజయ పథంలో ముందుకు సాగుతుంది. ఈ వినియోగదారుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు.


Click it and Unblock the Notifications








