రోల్స్ రాయిస్ ఘోస్ట్‌లో మరో కొత్త వేరియంట్ విడుదల

భారత్‌లో లగ్జరీ కార్లకు గిరాకీ బాగా పెరిగిపోతోందని తమ కొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ మోడల్ ద్వారా మరింత మార్కెట్ వాటాను దక్కించుకోవాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. కొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ లాంగర్ వీల్ బేస్ మోడల్‌లో ఉపయోగించిన 6.6 లీటర్ వి12 ఇంజన్ 563 బిహెచ్‌పిల శక్తిని 780 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు పొడవు 17.7 అడుగులు. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించే కొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ కేవల 5 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
ఈ కారు గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. భారత మార్కెట్లో ధరను రూ.3.05 కోట్లగా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో రోల్స్ రాయిస్ ఫాంటమ్, ఘోస్ట్ అనే మోడళ్లను విక్రయిస్తోంది. 2010లో కంపెనీ దేశీయ మార్కెట్లో మొత్తం 80 కార్లను విక్రయించింది.


Click it and Unblock the Notifications








