భారత్‌లో డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ విస్తరణపై రోల్స్ రాయిస్ కన్ను

Rolls-Royce
ఆల్ట్రా లగ్జరీ కార్లను తయారీదారు అయిన "రోల్స్ రాయిస్ మోటార్ కార్స్" భారత మార్కెట్లో తమ ప్రాచుర్యాన్ని మరింత పెంచుకోవడానికి సన్నాహాలు ప్రారంభించింది. లగ్జరీ కార్ల తయారీదారుల మధ్య పోటీ నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారత్‌లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకునేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఆసియాలో తమకు చైనా తర్వాత అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆటో మార్కెట్లలో భారత్ రెండవదని, తమ వినియోగాదారులు ఎక్కడ ఉంటే అక్కడ హాజరవ్వాలనుకుంటున్నామని, కాబట్టే భారత్‌లో తమ పంపిణీ వ్యవస్థ (డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్)ను విస్తరించడం దృష్టిసారించామని రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ సీఈఓ టోర్స్‌టెన్ ముల్లర్ చెప్పారు.

ఇదిలా ఉండగా... గతేడాది చైనాలో రోల్స్ రాయిస్ 600 కార్లను విక్రయించగా.. భారత్‌లో 80 కార్లను విక్రయించి 600 శాతం ఇయర్-ఆన్-ఇయర్ వృద్ధిని సాధించింది. ప్రస్తుతం రోల్స్ రాయిస్‌కు భారత్‌లోని ఢిల్లీ, ముంబైలలో రెండు డీలర్‌షిప్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. కనీసం మరో రెండు డీలర్‌షిప్ కేంద్రాలనైనా నెలకొల్పాలని భావిస్తున్నామని, ఇందుకోసం పంజాబ్, హైదరాబాద్ ప్రాంతాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. భారత్‌లో రోల్స్ రాయిస్ కార్లను ప్రజలు బాగా ఆదరిస్తున్నారని, మార్కెట్లో వీటికి ఉన్న డిమాండ్‌ను చూస్తుంటే సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. భారత్‌లో రోల్స్ రాయిస్ గోస్ట్, రోల్స్ రాయిస్ ఫాంటన్ అనే రెండు మోడళ్ల లగ్జరీ కార్లు మాత్రమే లభ్యమవుతున్నాయి. వీటి ధరలు రూ. 2.5 కోట్లు, రూ. 3.5 కోట్ల పైమాటే.

More from DriveSpark

Article Published On: Wednesday, February 23, 2011, 8:27 [IST]
English summary
Ultra-luxury car-maker Rolls-Royce Motor Cars today said it will be expanding its network in India to tap the opportunities here, its second-fastest growing market in Asia. While the company sold 600 cars in China last year, it sold 80 units in India, translating into year-on- year growth of 600%.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+