రికార్డు స్థాయిలో రోల్స్ రాయిస్ కార్ల విక్రయాలు

Rolls Royce
ప్రపంచంలో అత్యంత ఖరీదైన సూపర్ లగ్జరీ కార్లకు పెట్టింది పేరు "రోల్స్ రాయిస్". రోల్స్ రాయిస్‌కు 2010 సంవత్సరం ఓ గోల్డెన్ ఇయర్‌గా చెప్పవచ్చు. ఆసియా-పసిఫిక్ ప్రాంతాలలో పటిష్టమైన డిమాండ్, ప్రోత్సాహకర మార్కెట్ వాతావరణం నెలకొనడంతో గతేడాది ఈ లగ్జరీ బ్రాండ్ విక్రయాలు 2,711 యూనిట్లకు పెరిగాయి. ఒక్క భారత దేశంలోనే 2010 సంవత్సరంలో 70 రోల్స్ రాయిస్ కార్లు అమ్ముడయ్యాయి. 2009లో ఇవి కేవలం 10 కార్లు విక్రయించబడ్డాయి. ఈ సంస్థకు భారత్‌లోని న్యూఢిల్లీ, ముంబైలలో డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి.

కేవలం కోటీశ్వరులు మాత్రమే కొనుగోలు చేయగల ఈ కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో ఆ సంస్థ ఆనందోత్సాహాలను వెలిబుచ్చడంతో పాటు భవిష్యత్తులో మరింత వృద్ధిని సాధించలమన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసింది. కాగా.. 2008 సంవత్సరం విక్రయాలతో పోలిస్తే.. 2010 సంవత్సర విక్రయాలు రెండింతలకు పెరిగాయి. 2008లో కేవలం 1212 రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే విక్రయించగా.. 2009లో 1002 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే 2009 సంవత్సరంతో పోలిస్తే 2010 సంవత్సర విక్రయాలు 171 శాతం వృద్ధిని సాధించాయి.

రోల్స్ రాయిస్ సాధించిన ఈ వృద్ధిపై ఆసియా, పసిఫిక్, అమెరికా, మధ్యప్రాశ్చ్య దేశాల మార్కెట్లు మంచి ప్రభావాన్ని చూపించాయి. రోల్స్ రాయిస్‌కు అమెరికానే ఇప్పటికీ అతిపెద్ద ఏకైక మార్కెట్‌గా ఉంది. తర్వాతిస్థానాలలో, చైనా, బ్రిటన్ దేశాలున్నాయి. భారత్, కొరియా, సింగపూర్, జపాన్ దేశాలలో మరింత వృద్ధిని సాధించగలమని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుత కంపెనీ విక్రయాలను బట్టి చూస్తే.. మొదటి పది దేశాలలో ఆసియా-పసిఫిక్ ప్రాంతం అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాలలో ఉత్తర అమెరికా, మధ్యప్రాశ్చ్యం, యునైటెడ్ కింగ్‌డమ్, మెయిన్‌లాండ్ యూరప్, దక్షిణాఫ్రికాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 18, 2011, 11:36 [IST]
English summary
The growing Indian economy is revealed by yet another unstinted performance by a global auto giant Rolls Royce in the year 2010. The car’s sale volume stood at 2711 units marking a new opening in the Asia-Pacific region in a conducive atmosphere. The feat could be achieved by the Good wood companies through the contributions made by the so called new age maharajahs, the billionaire entrepreneurs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+