ఎక్సైజ్ సుంకాన్ని పెంచొద్దని ప్రణబ్‌కు యమహా విజ్ఞప్తి

ద్విచక్ర వాహన కొనుగోళ్లకు సంబంధించి రుణ లభ్యతపై దృష్టి పెట్టాలని, ఇందుకు సమంజసమైన వడ్డీరేట్లను ప్రతిపాదించాలని, ఫలితంగా అమ్మకాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. స్టీల్, అల్యూమినియం వంటి వాటిపై కస్టమ్స్ సుంకాన్ని కూడా పెంచవద్దని రాయ్ విజ్ఞప్తి చేశారు. వీటి ధరలు ఆటో రంగంపై మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహనాల తయారీపై తీవ్ర ప్రభావాలను చూపుతాయని తెలిపారు. యమహా మోటార్ ఇండియా ఇటీవల భారత స్కూటర్ల మార్కెట్లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసింజే. ఈ అంశంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని రాయ్ తెలిపారు.


Click it and Unblock the Notifications








