సరికొత్త ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌పై రూ.50,000 డిస్కౌంట్!

కొత్త ఫియస్టా సెడాన్‌ను కంపెనీ గడచిన జులై నెలలో దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. అయితే, అధిక ధరతో దీనిని విడుదల చేసినందు వల్ల ఈ మోడల్‌కు ఆదరణ కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ, వివిధ ప్రసార మధ్యమాల ద్వారా భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ఫోర్డ్ తన కొత్త ఫియస్టాను మార్కెటింగ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాగా.. ఈ మోడల్‌పై తాజాగా అందిస్తున్న ఈ భారీ డిస్కౌంట్ కొత్త ఫియస్టా అమ్మకాలకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది.
భారత మార్కెట్లో పెట్రోల్ వేరియంట్ ఫియస్టా ధరలు రూ. 8.23 లక్షల నుంచి రూ. 9.42 లక్షల మరియు డీజిల్ వేరియంట్ ఫియస్టా ధరలు రూ. 9.27 లక్షల నుంచి రూ. 10.42 లక్షల (అన్నిధరలు కూడా ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉన్నాయి. కొత్త ఫియస్టా ఏబిఎస్, ఈబిడి, ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లతో పాటు స్టీరింగ్ వీల్ ఆడియో కంట్రోల్ సిస్టమ్ అన్ని వేరియంట్లలో ఓ పరిమితిగా వస్తుంది.
ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్ టిఐవిసిటి పెట్రోల్ ఇంజన్ 106.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని విడుదల చేస్తూ ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్, లీటరు పెట్రోల్‌కు 17 కి.మీ. ఇస్తుంది. అలాగే, 1.5 లీటర్ 90 బిహెచ్‌పి డ్యురాటార్క్ డీజిల్ ఇంజన్ ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన మైలేజ్, లీటరు డీజిల్‌కు 23.5 కి.మీ. మైలేజీనిస్తుంది. మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో మారుతి సుజుకి ఎస్ఎక్స్4, హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వెంటో మరియు కొత్త హ్యుందాయ్ వెర్నా ఫ్లూయిడిక్ సెడాన్ మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








