భారత్‌లో మరో లగ్జరీ కారు ఎస్60ను విడుదల చేసిన వోల్వో

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సెడాన్, ఆడి ఏ4 సెడాన్ కార్లకు తమ ఎస్60 సెడాన్ గట్టి పోటీ ఇస్తుందని వోల్వో పేర్కొంది. వోల్వో ఇప్పటికే భారత మార్కెట్లో ఎస్80 సెడాన్ కారును, ఎక్స్‌సీ 90, ఎక్స్‌సీ 60 అనే రెండు స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను (ఎస్‌యూవీ) అందిస్తుంది. చైనా నుంచి ఈ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. తాము అందిస్తున్న లగ్జరీ ఎస్‌యూవీ వోల్వో ఎక్స్‌సీ60కు మంచి డిమాండ్ ఉందని, దీని డెలివరీకి కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతోందని, ఈ వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కంపెనీ వివరించింది.


Click it and Unblock the Notifications








