మేము డ్రైవింగ్ చేసి తీరుతాం...: డ్రైవింగ్ నిషేధంపై సౌదీ స్త్రీల నిరసన

Saudi Women
అరబ్ దేశాలు.. పేరుకేమో ధనిక దేశాలు ప్రవర్తనలో మాత్రం పాశవిక దేశాలు. సౌదీ అరేబియాలో మహిళలు వాహనాలు నడపడకూడదని ప్రాచీన కాలం నుంచే నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. దీన్ని అతిక్రమించి ఎవరైనా వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కారో, వారు ఎంతటి వారైనా సరే ఊచలు లెక్కబెట్టక తప్పదు. అక్కడి మహిళలకు లైసెన్సులు కూడా జారీ చేయరు. స్త్రీలు డ్రైవింగ్ నేర్చుకున్నా, వాహనం నడిపినా అది పెద్ద నేరంగా పరిగణిస్తారు. అయితే నానాటికీ అభివృద్ధి చెందుతున్న ఈ ప్రపంచంలో ఇప్పటికీ గిరి గీసి అందులోనే మహిళలను జీవించమనడం ఎంత వరకూ సమంజసం. దీంతో ఈ నిబంధలను వ్యతిరేకిస్తూ.. అక్కడి మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మగవాళ్లతో సమానంగా మేము కూడా వాహనాలు నడిపి చూపిస్తామంటూ సవాల్ చేస్తున్నారు. సౌదీలో స్త్రీలు వాహనాలు నడపడంపై ఉన్న నిషేధానికి వ్యతిరేకంగా శుక్రవారం మహిళలు రియాద్ నగర వీధుల్లో తమ నిరసన వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్, ట్విటర్‌ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లలో ఇచ్చిన పిలుపు మేరకు వారు స్పందించి వారు తమ వాహనాలను రోడ్డెక్కించారు. సౌదీలో నిరసన ప్రదర్శనలపై నిషేధం ఉండటంతో సంప్రదాయ కట్టుబాట్లపై వారు ఈ విధంగా తమ నిరసన తెలిపారు. సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లెసైన్సులు ఇవ్వరు కాబట్టి ఇతర దేశాలనుంచి తీసుకున్న డ్రైవింగ్ లెసైన్సులతో వారు తమ వాహనాలు డ్రైవ్ చేసి నిరసన గళాన్ని వినిపించారు.

గత నెలలో కూడా ఓ సౌదీ మహిళ వాహనం నడిపి ఆ ఫోటోలను ఇంటర్నెట్‌లో పెట్టినందుకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అయితే సౌదీలో మహిళలు డ్రైవింగ్‌ చేయరాదని ఎలాంటి వ్రాతపూర్వక శాసనం లేదు. రాజుల కాలం నుంచి తరతరాలుగా అదొక మత పెద్దలు పెట్టిన కట్టుబాటుగా మాత్రమే అనుసరిస్తున్నాట్లు సమాచారం.

More from DriveSpark

Article Published On: Saturday, June 18, 2011, 12:28 [IST]
English summary
Saudi Arabia Women are driving ban. Saudi law denies women the right to drive, but Friday women will gather in cars together and drive in an attempt to end this ban.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+