న్యూఢిల్లీ: స్థానిక పాలన వ్యవస్థ విధించిన వ్యవసాయేతర సెజ్‌ను సవాలు చేస్తూ టాటా మోటార్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. పుణే సమీపంలోని పింప్రీలో కంపెనీకి వాణిజ్య వాహన తయారీ యూనిట్ ఉంది. ఆ ప్లాంటుపై ఇక్కడి స్థానిక పంచాయితీ వ్యవసాయేతర సెస్‌ను విధించింది. కంపెనీ పిటిషన్‌ను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ పన్నును విధించే అధికారం స్థానిక పాలన వ్యవస్థకు ఉందని పేర్కొంది. బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ప్రభుత్వం నుంచి అద్దెకు తీసుకున్న స్థలంలో ప్లాంట్ ఉందని, అద్దెకు తీసుకున్న వారు ఈ సెస్‌ను చెల్లించాల్సిన అవసరం లేదని కంపెనీ వాదించింది. 1996 నుంచి వ్యవసాయేతర సెస్ కింద మొత్తం రూ.45 లక్షలు చెల్లించాలని స్థానిక పంచాయితీ కంపెనీకి 2002, ఫిబ్రవరిలో నోటీసు ఇచ్చింది.