మారుతి సుజుకి మొండిపట్టు వెనుక రహస్యం ఏంటి..!?

ఇదే సమయంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే పేరిట శాశ్వత కార్మికులను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఉన్న కార్మికులను బాండ్ నెపంతో బయటకు నెట్టి వారికిచ్చే జీతాలక్ననా తక్కువ జీతాలకే కాంట్రాక్టు కార్మికులను నియమించుకుంటోందని, ఆటోమొబైల్ రంగంలోని కంపెనీలన్నీ కలిసి ఈ చర్యకు పూనుకుంటున్నాయని విమర్శకులు వాదిస్తున్నారు.
తొలుతగా మారుతి సుజుకి ఈ విధానానికి తెర లేపింది. ఇందులో మారుతి సుజుకి యాజమాన్యం గెలిచినట్లయితే ఇతర కంపెనీలు సైతం ఉత్పత్తి తగ్గింపు, వ్యయ నియంత్రణల పేరిట శాశ్వత కార్మికుల సంఖ్యను తగ్గించే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం మారుతి సుజుకి మొండి వైఖరికి ఇటు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడం ఈ అనుమానాలను మరింతగా పెంచుకున్నాయి.
దీంతో మానేసర్ కార్మికులు తమ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. ప్రస్తుతం మానేసర్ సమ్మె సెగలు గుర్గావ్-మానేసర్ బెల్ట్‌ను తాకాయి. మారుతి సుజుకి మానేసర్ కార్మికులకు మద్దుతుగా ఆ పరిసరం ప్రాంతంలోని వివిధ కంపెనీలు కూడా సమ్మె చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి అప్పుడైనా ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటాయో లేక మిన్నకుంటాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications








