దిగమతి సుంఖంపై రతన్ టాటా మర్చడానికి కారణం..!?

ఒకవేళ ఇదే గనుక జరిగితే భారత ఆటోమొబైల్ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి పడే ఆస్కారం ఉంది. యూరప్ కార్లు భారత్‌లోకి ప్రవేశిస్తే.. మార్కెట్ పోటీని తట్టుకునేందుకు దేశీయ కంపెనీలు కూడా తప్పనిసరిగా తమ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గించాల్సి వస్తుంది. ఫలితంగా కంపెనీల మార్జిన్లు పడిపోయి దివాళా తీసే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఈ ఒప్పందం వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే 110 శాతంగా ఉన్న దిగుమతి సుంఖాన్ని మరింత పెంచాలని అంటోంది. దీని వల్ల భారత్‌కు విదేశీ కంపెనీల వలస తగ్గి, దేశీయ కంపెనీలను రక్షించినట్లు అవుతుంది. మన దేశంలో దాదాపు అన్ని ప్రముఖ విదేశీ కంపెనీలకు ఉత్పత్తి కేంద్రాలు లేవు, కేవలం అసెంబ్లింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇదే విషయాన్ని రతన్ టాటా కూడా స్పష్టం చేశారు.
అయితే రతన్ టాటా మాటలను బట్టి పరిశీలిస్తే.. టాటా గ్రూపు ఇటీవలే కొనుగోలు చేసిన బ్రిటన్ యూనిట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్)ను వెనకేసుకొస్తున్నట్లు తెలుస్తుంది. జేఎల్ఆర్‌ను టాటా గ్రూపు 2008లో కొనుగోలు చేసింది, ఆ సమయంలో అది దాదాపు సిక్ ఇండస్ట్రీగా మారిపోయిన పరిస్థితిలో ఉండేది. కానీ దీనిని టాటా స్వాధీనం చేసుకున్న తర్వాత ఇది మార్కెట్ అంచనాలకు మించి వృద్ధి చెందుతూ అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తూ టాటా మోటార్స్‌కు విదేశాల్లో మరింత గుర్తింపు తెచ్చిపెడుతుంది. మరోవైపు ఈ బ్రాండ్‌కు మన దేశంలో కూడా భారీ క్రేజ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ ఈ బ్రాండ్ వాహనాలను బ్రిటన్ నుంచి పూర్తిగా తయారైన యూనిట్లను కానీ లేదా విడిభాగాలుగా భారత్‌కు తెచ్చుకొని అసెంబ్లింగ్ చేసుకోవాల్సిందే తప్ప, పూర్తిగా భారత్‌లో తయారు చేసే ఆస్కారం లేదు.
కాబట్టి తమ బ్రిటన్ కార్లను భారత్‌కు రప్పించుకునేందుకు టాటా గ్రూపు ప్రభుత్వానికి భారీగా దిగుమతి సుంఖాలను చెల్లించాల్సి వస్తుండటంతో టాటా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునని విమర్శకులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ.. బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్ల జోరుకు చెక్ పెట్టాలంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్‌లో మరిన్ని మోడళ్లు భారత మార్కెట్లోకి ప్రవేశించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








