హోండా సియోల్ కొత్త మార్కెటింగ్ డైరెక్టర్‌గా సేకి ఇనాబా

Honda
జపాన్‌కు చెంది హోండా మోటార్ కార్పోరేషన్ భారతీయ అనుబంధ సంస్థ అయిన హోండా సియోల్ కార్స్ ఇండియా "సేకి ఇనాబా"ను తమ కంపెనీకు మార్కెటింగ్ డైరెక్టర్‌గా నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 1, 2011 నుండి ఇనాబా నియామకం అమలులోకి రానున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పటి వరకు సంస్థ బాధ్యతలు నిర్వర్తించిన తత్సూయ నట్సూమే స్థానంలో ఇనాబా బాధ్యతలు స్వీకరించనున్నారు. తత్సూయ నట్సూమే ఫిలిప్పీన్స్‌లో ఉన్న హోండా ఫిలిప్పీన్స్‌కు ప్రెసిడెంట్, సీఈఓగా వెళ్లనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇనాబా నియామకంతో ఆయన సంస్థలోని హెచ్‌ఎస్‌సిఐకి చెందిన 9 మంది డైరక్టర్లలో ఒకరుగా బాధ్యతలు నిర్వహిస్తారని, మార్కెటింగ్‌, సేల్స్‌ డివిజన్‌కు ఆయన హెడ్‌గా ఉంటారని, తను నేరుగా హెచ్ఎస్‌సిఐ అధ్యక్షుడు, సీఈఓ తకాషి నగాయ్‌కు రిపోర్ట్ చేస్తారని ఆ ప్రకటనలో పేర్కొని ఉంది. గడచిన రెండు దశాబ్దాలుగా ఇనాబా హోండా సంస్థలో పనిచేస్తున్నారని, హెచ్‌ఎస్‌సిఐలో చేరక ముందు కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సిఐఎస్‌), మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికా దేశాలలో సేల్స్‌ డివిజన్‌ కార్యకలాపాలను పర్యవేక్షించేవారని కంపెనీ వివరించింది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 29, 2011, 10:32 [IST]
English summary
Honda Siel Cars India today said it has appointed Seki Inaba as its Director for Marketing with effect from April 1, 2011. Inaba will take charge from incumbent Tatsuya Natsume, who will move to Philippines as President and CEO of Honda Philippines, the company said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+