యూపి అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్: ఎస్ఐఎల్ అమ్మకం వాయిదా

Scooters India Ltd
లక్నోకు చెందిన ప్రభుత్వరంగ సంస్థ 'స్కూటర్స్ ఇండియా లిమిటెడ్' (ఎస్‌ఐఎల్) వ్యూహాత్మక విక్రయం (స్ట్రాటజిక్ సేల్) వచ్చే ఏడాదికి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్/మేలో జరిగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్కూటర్స్ ఇండియా వాటా విక్రయాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. ఈ ఎన్నికల తర్వాత ఎస్‌ఐఎల్ అమ్మకం జరిపాలని సర్కారు భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

స్కూటర్స్ ఇండియా కంపెనీలో ప్రభుత్వానికి ఉన్న 95.38 శాతం వాటాలను వ్యూహాత్మక విధానం(అవుట్‌రైట్ సేల్)లో ఓ ప్రైవేట్ సంస్థకు విక్రయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిన నేపధ్యంలో దీనికి పార్లమెంటు నుంచి అనుమతి పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే 2012లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఐఎల్ విక్రయాన్ని రాజకీయం చేయకుండా ఉండేందు కోసం యపి రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఈ విక్రయాన్ని వాయిదావేయాల్సిందిగా కోరినట్లు సమాచారం.

మొత్తం 1200 మంది రెగ్యులర్ ఉద్యోగులు పనిచేసే స్కూటర్స్ ఇండియా కంపెనీ 2002-03 నుంచి నష్టాల్లో చిక్కుకుంది. 2009 మార్చిలో ఈ కంపెనీను ఖాయిలా పరిశ్రమగా (సిక్ ఇండస్ట్రీ)గా ప్రకటించి బోర్డ్ ఫర్ రికన్సోలేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (బిఆర్‌పిఎస్ఈ)కు రెఫర్ చేయడం జరిగింది. 1972లో ప్రారంభమైన స్కూటర్స్ ఇండియా కంపెనీ తొలుతగా దేశీయ మార్కెట్ కోసం విజయ్ సూపర్ బ్రాండ్ పేరుతో స్కూటర్లను అలాగే, విదేశీయ మార్కెట్ల కోసం లాంబ్రెట్టా పేరుతో స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. అనంతరం విక్రమ్ బ్రాండ్ పేరుతో త్రిచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించింది. కానీ.. 1997లో స్కూటర్ల ఉత్పత్తిని నిలిపివేసి కేవలం త్రిచక్ర వాహనాల ఉత్పత్తికి మాత్రమే పరిమితమైంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 11, 2011, 11:49 [IST]
English summary
Lucknow-based PSU Scooters India Ltd (SIL) strategic sale may be postponed due to upcoming Uttar Pradesh Assembly Polls, which are scheduled in April/May 2012. Govt. sources said. “A lot depends upon the political will in terms of timings of stake sale,” an official said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+