సింగూరు భూమిపై టాటాకు మరో ఎదురు దెబ్బ

Tata Motors
కోల్‌కత్తా: సింగూరు భూములపై టాటా మోటార్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. టాటా కారు ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు కేటాయించిన సింగూరు భూములను రైతులకు పంపిణీ చేయాలనే మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనే టాటా విజ్ఞప్తిని కలకత్తా హైకోర్టు తిరస్కరించింది. సింగూరు భూములను రేపు (మంగళవారం) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రైతులకు పంపిణీ చేయనుంది. దాన్ని నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని టాటా మోటార్స్ కోర్టును కోరింది.

రేపటి నుంచి భూమి పంపిణీ జరుగుతుందని ఏ విధమైన ప్రకటన వెలువడినట్లు పిటిషన్ ద్వారా తమ దృష్టికి రానందున మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్రా పాల్ చెప్పారు. టాటా మోటార్స్ కౌన్సెల్ సమరాదిత్య పాల్ భూమి పంపిణీని ఆపేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఎక్స్ పార్టీ పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యర్థి పార్టీ కోర్టుకు వెళ్లినందున అది జరగదని పశ్చిమ బెంగాల్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ సీనియర్ కౌన్సెల్ సకినాథ్ ముఖర్జీ చెప్పారు.

Most Read Articles

English summary
The Kolkata high court on Monday refused to pass an interim order restraining the West Bengal government from distributing to farmers in Singur the land acquired earlier to set up Tata's car manufacturing unit.
Story first published: Tuesday, June 19, 2012, 14:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X