మూడేళ్లలో మరో ఆరు కొత్త మోడళ్లు: హ్యుందాయ్ మోటార్

అంతే కాకుండా.. ఈ ప్రచారాన్ని మార్కెట్ చేసుకోవడానికి రానున్న మూడేళ్లలో కొత్తగా మరో ఆరు మోడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. తొలి రెండేళ్లలో ఏటా రెండు కొత్త మోడళ్లను, మిగిలిన రెండు మోడళ్లను మూడో సంవత్సరంలో ప్రవేశపెట్టాలని హ్యుందాయ్ నిర్ణయించినట్లు కంపెనీ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) వెల్లడించారు.
ఈ ఏడాది భారత మార్కెట్లో 63 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. గతేడాది కంపెనీ 60 లక్షల యూనిట్లను విక్రయించింది. తాము అందిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటి కారు శాంటా ఫే మార్చి నెలాఖరులో కానీ లేదా ఏప్రిల్ ప్రారంభంలో కానీ పునరుద్ధరిస్తామని కంపెనీ తెలిపింది. కంపెనీ ఎగుమతులు 2.47 యూనిట్లకు పెరిగాయని, ఇందులో యూరప్ మార్కెట్‌కే అధికంగా ఎగుమతులు జరిగాయని, అలాగే ప్రస్తుతం ఉన్న 115 దేశాలు కాేకుండా.. కొత్త మార్కెట్ల కోసం అన్వేషిస్తున్న కంపెనీ వివరించింది.


Click it and Unblock the Notifications








