భారత్‌లో 10 వసంతాలు పూర్తి చేసుకున్న స్కొడా ఆటో

Skoda Fabia
చెక్ రిపబ్లిక్‌కు చెందిన స్కొడా ఆటో (ఫోక్స్‌వ్యాగన్ అనుబంధ సంస్థ) తన ఖాతాలో మరో మైలురాయిని అధిగమించింది. స్కొడా భారత్‌లోకి 10 వసంతాలు పూర్తయిన సందర్భంగా కంపెనీ సంబరాలు జరుపుకుంటోంది. 10వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ 'స్కొడా సెలబ్రేషన్' క్యాంపైన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే అన్ని స్కొడా అవుట్‌లెట్లలో ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకనటలో పేర్కొంది. తాము అందిస్తున్న ఉత్పత్తులైన ఫ్యాబియా, లారా, యెటి, సూపర్బ్ మోడళ్లకు మార్కెట్ నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందని కంపెనీ తెలిపింది. గత నెల విక్రయాలలో స్కొడా వంద శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.

భారత్‌లో తమ ప్రయాణం అత్యంత నమ్మికతో సాగిందని, గడచిన పదేళ్లుగా తమ ఉత్పత్తుల విక్రయాల్లో స్థిరమైన పెరుగుదల కనిపించిందని స్కొడా ఆటో ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్, బోర్డ్ సభ్యులు థామస్ కుయెల్ తెలిపారు. తమ సంస్థ భవిష్యత్తులో మరింత వృద్ధిని సాధించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్కొడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 81 డీలర్‌షిప్ కేంద్రాలను కలిగి ఉంది. అందులో 73 డీలర్‌షిప్ షోరూమ్‌లు కాగా మిగిలిన 8 బోటిక్యూ షోరూమ్స్. భవిష్యత్తులో భారత మార్కెట్లో తమ పరిమితిని మరింత పెంచుకునే దిశగా కంపెనీ అడుగులు వేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 15, 2011, 15:23 [IST]
English summary
Skoda Auto India, a fully owned subsidiary of Skoda Auto a.s., Czech Republic and one of the most promising automobile companies in India completes a milestone of 10 years of its presence in India. On the occasion of its 10th anniversary Skoda launches ‘Skoda Celebration’ campaign with special offers across all of Skoda’s carlines.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+