సమ్మర్ చెకప్ క్యాంప్‌ను ప్రారంభించిన స్కోడా ఆటో ఇండియా

ఈ సమ్మర్ క్యాంప్‌లో భాగంగా స్కోడా కార్లను ఉచితంగా 16 పాయింట్ చెకప్ చేస్తామని కంపెనీ తెలిపింది. కారు ఏసి, ఇంజన్, స్టీరింగ్, క్లచ్, ఎలక్ట్రకల్ సిస్టమ్, టైర్స్ అండ్ వీల్ రిమ్స్ వంటి ముఖ్యమై భాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపాలేవైనా ఉంటే సవరించడం జరుగుతుందని కంపెనీ తెలిపింది. ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా కంపెనీ దాదాపు 20,000 స్కోడా కార్లను తనిఖీ చేయాలనే లక్ష్యంతో ఉంది.
తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో కంపెనీ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఈ సమ్మర్ క్యాంప్‌ను స్కోడై యజమానులు సద్వినియోగం చేసుకోవాలని స్కోడా ఆటో ఇండియా డైరెక్టర్ అండ్ బోర్డు మెంబర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) థామస్ కుయెహ్ల్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








