ఐదు కొత్త మోడళ్లను విడుదల చేయనున్న స్కొడా ఆటో

Skoda Superb
చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ (ఫోక్స్‌వ్యాగన్ అనుబంధ కంపెనీ) స్కొడా భారత మార్కెట్లో ఐదు కొత్త మోడళ్లను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ ఐదు మోడళ్ల ముందుగా తమ లగ్జరీ సెడాన్ 'సూపర్బ్'ను కంపెనీ విడుదల చేయనుంది. భారత మార్కెట్ కోసం రూపుదిద్దుకుంటున్న సూపర్బ్ శక్తివంతమైన ఇంజన్‌తో పాటుగా అధిక ఇందన సామర్థ్యాన్ని కలిగి ఉండి మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లతో లభ్యం కానుంది. ఇకపోతే కంపెనీ అందించనున్న రెండవ మోడల్ 'ర్యాపిడ్'. స్కొడా అందిస్తున్న మిడ్-సైజ్ ఎగ్జిక్యూటివ్ సెడాన్ ర్యాపిడ్, ఒకప్పుడు స్కొడా తొలి భారత మోడల్ అయిన అక్టావియా స్థానాన్ని భర్తీ చేయడానికి రానుంది.

స్కొడా ర్యాపిడ్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది, ఈ ఏడాది ఏదో ఒక సమయంలో ర్యాపిడ్ భారత్‌కు రానుంది. ఈ మోడల్ నిర్మాణంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఫోక్స్‌వ్యాగన్ వెంటో సెడాన్ ఫ్లాట్‌ఫామ్‌ ఆధారంగా ఇది రూపుదిద్దుకోనుంది. మార్కెట్ వాటాను పెంచుకునేందుకు కొత్త మోడళ్లను విడుదల చేయాలని భావిస్తున్నామని స్కొడా ఇండియాకు చెందిన థామస్ కూయెల్ చెప్పారు. అంతేకాకుండా.. స్కొడా ఫ్లాగ్‌షిప్ హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ ఫ్యాబియాకు దిగువన రూ. 3-5 లక్షల మధ్యలో మరో చిన్న కారును ప్రవేశపెట్టాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. అలాగే, స్కొడా యెతిలో టూవీల్ డ్రైవ్ సిస్టమ్ కలిగిన ఓ చౌక వేరియంట్‌ను కూడా విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, July 8, 2011, 18:04 [IST]
English summary
Skoda, the Czech carmaker and subsidiary of the Volkswagen Group has decided to launch five new models in India. The first among the five will be the refurbished Superb luxury sedan. The Superb has been a segment leader and Skoda India wants to add more features along with a more fuel efficient yet powerful engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+