సెడాన్ వెర్షన్ ఫ్యాబియాను విడుదల చేయనున్న స్కొడా

ప్రస్తుతం ఛాకన్ ప్లాంటులో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ మూడు మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 1.1 లక్షల యూనిట్లు. ఈ ప్లాంటులో ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్, వెంటో సెడాన్ మరియు స్కొడా ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు తయారవుతున్నాయి. 60 ఎకరాల్లో ఉండే ఈ ప్లాంటు కోసం కంపెనీ రూ. 3,800 కోట్లను పెట్టుబడులుగా వెచ్చించింది. ఆటో పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, స్కొడా ఫ్యాబియా సెడాన్ కారుకు 'ర్యాపిడ్' అని నామకరణం చేయవచ్చు. ఫ్యాబియా సెడాన్‌ను వెంటో ఫ్లాట్‌ఫామ్‌పై రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ దీపావళి నాటికి ఇది మార్కెట్లోకి రావచ్చునని అంచనా.


Click it and Unblock the Notifications








