యెటిలో చౌక వేరియంట్‌ను విడుదల చేసిన స్కొడా

Skoda Yeti
చెక్-రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కొడా (ఫోక్స్‌వ్యాగన్ అనుబంధ కార్ బ్రాండ్) దేశీయ మార్కెట్లో అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) 'స్కొడా యెటి'లో ఓ చౌక వేరియంట్‌ను కంపెనీ నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం 13.35 లక్షల (ఎక్స్-షోరూమ్, ముంబై) ధరకే స్కొడా ఓ టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్ కలిగిన యెటి కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది.

ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ (4x4) కలిగి స్కొడా యెటి ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.15.4 లక్షలుగా ఉంది. స్కొడా తాజాగా అందిస్తున్న టూ-వీల్ డ్రైవ్ యెటి ఎస్‌యూవీ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇందులో ఉపయోగించిన 2-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ 110 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇదే ఇంజన్‌ను స్కొడా లారా సెడాన్‌లో కూడా మనం గమనించవచ్చు. స్కొడా యెటి సెడాన్ డీజిల్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతుంది.

కొత్త స్కొడా యెటిలో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎయిర్‌బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇది యాక్టివ్, యాంబిషన్ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. స్కొడా ఫోర్-వీల్ డ్రైవ్ యెటితో పోల్చుకుంటే టూ-వీల్ డ్రైవ్ యెటి ఎస్‌యూవీ బరువు సుమారు 100 కిలలో వరకూ తక్కువగా ఉంటుంది. ఇది ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం లీటరుకు 17.72 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 23, 2011, 16:02 [IST]
English summary
Skoda India has launched a two wheel drive version of its Yeti premium SUV. The new 4X2 Yeti is priced at RS.13.35 lakhs (ex showroom, Mumbai) and is comparatively cheaper than the four wheel drive version that is priced at Rs.15.4 lakhs. The 4X2 Yeti is also cheaper due to the use of a five speed manual gearbox. The new Yeti is for someone who does not go for serious off-roading expeditions.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+